దొంగ పాస్ పోర్టు వ్యవహారంలో రాజకీయం చేయడాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ మానుకోవాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విదేశీయులు దేశంలోకి చొరబడుతున్నారని.. దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలని.. నీ తండ్రి డీఎస్ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. నోరు ఉంది కదా అని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే షకీల్ హెచ్చరించారు. బోధన్‌లో రోహింగ్యాలు లేరని ఆయన పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టడం మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఎంపీ అర్వింద్‌కు షకీల్ సూచించారు. అర్వింద్ మళ్ళీ ఎంపీగా గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే షకీల్ సవాల్ విసిరారు.