అసలే అంధులు.. కరోనా దెబ్బతో మరింత దైన్యస్థితి

Update: 2020-09-08 08:03 GMT

మూడు పూటలా తిండిలేక కొట్టుమిట్టాడుతున్న ఓ కుటుంబం. ఆపై కుటుంబంలో ముగ్గురూ అందులే. అసలే జనాలపై దాడి చేస్తున్న కరోనా వైరస్. దీంతో ఒక్కపూట గడవడమే కష్టంగా మారిన వైనం. పైకి ముఖంలో చిరునవ్వున్నా మనసులో చెప్పలేనంత బాధ. పూరి గుడిసెలో బతుకు బండి నడుపుతున్న ఓ కుమారస్వామి కథ ఇది.

అది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం. అయితే ఆగ్రామానికి చెందిన కుమారస్వామి అందుడు. విధివైపరిత్యంతో తన పదోయేట చూపును కోల్పోయాడు. దీంతో తన తల్లి ఏదో ఒక పనిచేస్తూ తనను పోషించి పెద్దవాన్ని చేసింది. ఇంతలోనే ఆతల్లిని మృత్యువు కాటేసింది. అయితే కుమారస్వామి తనకు ఏతోడు లేకపోవడంతో ఓ అమ్మాయిని వివాహమాడాడు.

అంధత్వం ఉన్న కుమారస్వామి భార్యతో కలిసి ఏదో ఒకపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి ఓ కుమారుడు జన్మించాడు. పుట్టింది మగబిడ్డ అయినా రెండుకళ్లు లేవు. దీంతో కుమారస్వామి కొడుకు పుట్టాడు అని సంతోషించాలో లేక దేవుడు కళ్లు లేని కొడుకుని ఇచ్చాడో అని బాధ పడాలో తెలియక ఆవేదన చెందుతున్నాడు. అయినా మనసులో తన కొడుకు తనలా కావొద్దనే బాధ వెరసి సంపాదించిన డబ్బంతా తన కుమారుడి చూపుకోసం ఖర్చుచేశాడు.

ఈక్రమంలోనే ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆకుటుంబంపై పంజా విసిరింది. ఇంటినుండి పనులకు వెళ్లలేని దుస్థితిని తీసుకొచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియక కుమారస్వామి భిక్షాటన ప్రారంభించాడు. వచ్చిన డబ్బులతో కడుపునిండా తినలేక ఆకుటుంబం ఆకలితో అలమటిస్తోంది. పైకి కనబడకపోయినా మనసు నిండా బాధ తనను నమ్ముకున్న కుటుంబానికి కనీసం తిండి పెట్టలేకపోతున్నానే తపనతో ఆయన తనను ఆదుకునే వారు రాకుండా పోతారా..? అంటూ ఆశతో ఎదురుచూస్తున్నాడు.

120కోట్లకు పైగా జనాలు ఉన్న ఈదేశంలో కుమారస్వామి కుటుంబాన్ని ఆదుకునే వారు ముందుకు రావాలి. ఆ‍యన కష్టాన్ని తీర్చాలి. సంపాదనలోనే కాదు బాధపడుతున్న వారికి మేమున్నామంటూ సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇవ్వాలి. నాదేశం ఆకలితో అలమిటిస్తున్న దేశం కాదని ప్రపంచానికి నిరూపించాలని కోరుకుందాం.

Full View


Tags:    

Similar News