Black Fungus Injections: హైదరాబాద్‌లో బ్లాకులో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు విక్రయం
Black Fungus Injections: రూ.8 వేలు ధరున్న ఇంజక్షన్ రూ.50 వేల వరకు బ్లాకులో అమ్మకం
Black Fungus Injections: హైదరాబాద్ కమిష్‌నరేట్ పరిధిలో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ యద్ధేచ్ఛగా సాగుతోంది. ప్రజల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. గతంలో రెమిడెసివియర్ పేరుతో భారీగా దోచుకున్న ముఠాలు ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల పేరుతో నల్ల మార్కెట్‌లో రెచ్చిపోతు ప్రజలను లక్షల్లో మోసం చేస్తున్నారు.
నగరంలోని హైదరాబాద్ కమీష్‌నరేట్ పరిధిలో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తు ప్రజలను మోసం చేస్తున్న ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రాంతి కుమార్, వెంకట్ దినేష్, శ్రీనివాస్‌లు ఓ ముఠాగా ఏర్పడి ప్రజల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు. 8 వేల ధర ఉన్న ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్ లో 50 వేలు అంతకు పైగా ధరలకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. వీరి నుండి 36 ఇంజక్షన్లు స్వాదీనం చేసుకున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీష్‌నర్ అంజనీ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కమీష్‌నరేట్ పరిధిలో ఈ తరహా కేసులు 58 నమోదు కాగా 136 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 450 ఇంజక్షన్లను సీజ్ చేశారు పోలీసులు.
ఏదేమైనా ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించడంతో పాటు హైదరాబాద్ కమీష్ నరేట్ పరిధిలో ఇలాంటి దందాల సమాచారం ఉంటే వెంటనే 9490616555 నెంబర్ కు తెలియజేయాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.