Minister KTR: అంబేద్కర్ దార్శనికత వల్లే తెలంగాణ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుపుల్ల..
Minister KTR: స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ విలీనమైన రోజును ఘనంగా జరుపుకొంటున్నామని, ఆనాటి పోరాట వీరుల త్యాగాలు మరువలేనివని గుర్తు్ చేసుకున్నారు మంత్రి కేటీఆర్
Minister KTR: స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ విలీనమైన రోజును ఘనంగా జరుపుకొంటున్నామని, ఆనాటి పోరాట వీరుల త్యాగాలు మరువలేనివని గుర్తు్ చేసుకున్నారు మంత్రి కేటీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ దార్శనికత వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆంధ్రాలో కలపవద్దని తెలంగాణ సమాజం ఆనాడే వ్యతిరేకించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అద్భుతంగా జరుగుతోందన్నారు. నేతన్నలకు 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదనేనన్నారు మంత్రి కేటీఆర్... ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నామని, కులమతాల పేరుతో చిచ్చుపెట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు అడ్డుపుల్లలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతుబంధు, రైతు భీమా పథకాలతో రైతులకు భరోసా కల్పిస్తున్నామని, ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపామని, సీఎం కేసీఆర్ నిబద్ధత వల్లే ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తడులు దుంకుతున్నాయని చెప్పారు. అర్హులైన అందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు కేటీఆర్ ఎనిమిదేళ్లు గుర్తుకురాని తెలంగాణ కేంద్రానికి ఇప్పుడు గుర్తొచ్చిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ కు అమీత్ షా వచ్చి చిల్లర మల్లర మాటలు చెప్తారని దుయ్యబట్టారు. కేంద్రం ఇప్పటివరకు పైసా సాయం చేయలేదని, కేంద్ర పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు సంపాదించాలనేదే వారి ఉద్దేశమని ఆరోపించారు కేటీఆర్.