Telangana: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నేతల క్యూ..
Telangana: ఈ నెల 24, 25, 27న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోడీ
Telangana: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నేతల క్యూ కడుతున్నారు. జాతీయ నేతల రాకతో ఎన్నికల హడావుడి మరింత హీటెక్కింది. తెలంగాణలో ప్రచారం నిర్వహించి.. కార్యకర్తల్లో అగ్రనేతలు జోష్ నింపనున్నారు. ఈ నెల 24, 25, 27న ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శేరిలింగంపల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు తమిళనాడు బీజేపీ చీఫ్, ముషీరాబాద్‌లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ రోడ్ షోలో పాల్గొననున్నారు.