Laxman: కేసీఆర్ ప్రభుత్వం లీకుల సర్కార్‌గా మారింది.. దేశంలో మద్యానికి నడకలు నేర్పిన పార్టీ బీఆర్‌ఎస్..
Laxman: కేసీఆర్ ప్రభుత్వం లీకుల సర్కార్‌గా మారిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్.
Laxman: కేసీఆర్ ప్రభుత్వం లీకుల సర్కార్‌గా మారిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. పేపర్ లీకేజీల వెనక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హస్తం ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. గతంలో డ్రగ్స్, నయీం, ఓటుకు నోటు కేసుల్లో సిట్ విచారణలు ఏమయ్యాయో అందరికీ తెలుసన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో ఎలాంటి విచారణ అయిన కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణ నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. దేశంలో మద్యానికి నడకలు నేర్పిన పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ అన్నారు.