Laxman: 10ఏండ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేని కేసీఆర్.. ఇప్పుడు ఇస్తానని అంటున్నారు

Laxman: ఇందిరమ్మ ఇండ్లు అని నినాదాకే పరిమితమైంది

Update: 2023-11-14 10:18 GMT

Laxman: 10ఏండ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేని కేసీఆర్.. ఇప్పుడు ఇస్తానని అంటున్నారు

Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఉపఎన్నికలు వస్తే కుర్చీ వేసుకొని అక్కడే ఉండే కేసీఆర్.. ఆ తర్వాత ముఖం చాటేశాడని ఆయన విమర్శించారు. 10ఏండ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేని కేసీఆర్.. ఇప్పుడు ఇస్తానని అంటున్నారు. 10 ఏండ్లలో చేయలేని అభివృద్ధి 10 రోజుల్లో ఎలా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ 70 ఏండ్లు అధికారంలో ఉండి గరీబ్ హఠావో.. ఇందిరమ్మ ఇండ్లు అని నినాదాకే పరిమితమైందన్నారు.

Tags:    

Similar News