BJP MLA's: అన్యాయం జరిగిన చోటే న్యాయం కోసం బీజేపీ ఎమ్మెల్యేల ఎదురుచూపు
BJP MLA's: కోర్టు సూచనలతో అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరయ్యేందుకు చేరుకున్న ఎమ్మెల్యేలు
BJP MLA's: అన్యాయం జరిగినచోటే న్యాయంచేయమని కోరేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. సభా హక్కులను హరించారని, ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో తమను సస్సెన్షన్ చేశారని హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ నిరాకరించినా, డివిజన్ బెంచ్ సూచనతో ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హారజరయ్యేందుకు నిర్ణీత సమయానికంటే ముందే చేరుకున్నారు. కోర్టు సూచనలతో అసెంబ్లీ కార్యదర్శిని కలసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందనరావు కోర్టు సూచనను విన్నవించారు. అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్లారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని బీజేపీ ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు హైకోర్టు ఉత్తర్వులతో స్పీకర్ ఎదుట హజరయ్యేందుకు వచ్చిన విషయమై అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ తదనంతర పరిణామాలతో స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉండటంతో రాజకీయాలు ఆసక్తిని రేకెత్తించాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోని ఆసక్తి రేకెత్తిస్తోంది.