Laxman: ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ మౌనానికి కారణమదేనా?
BJP Laxman: ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.
BJP Laxman: ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ అంశంలో రేవంత్ సర్కార్ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తప్పు చేస్తే ఎంతటివారినైనా జైలుకు పంపిస్తామన్న రేవంత్.. వారిపై చర్యలెందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం, పేపర్ లీక్ ఘటనల్లో చర్యలేవీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు లక్ష్మణ్. పోలీసు అధికారులు, కేసీఆర్ ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిందితుడు వాంగ్మూలంలో చెప్పారన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మాఫియా నడిపించారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల ఫోన్లు, చివరికి జడ్జిల ఫోన్లూ ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఢిల్లీ ఒత్తిళ్లకు లొంగిపోయారా? అని ప్రశ్నించారు.