Dalit Bandhu Huzurabad By Polls : కేసీఆర్‌కు శాలపల్లి గ్రామస్తుల ఝలక్

Dalit Bandhu: తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసక్తికరంగా కొనసాగుతోంది.

Update: 2021-11-02 06:13 GMT

Dalit Bandhu: కేసీఆర్‌కు శాలపల్లి గ్రామస్తుల ఝలక్

Dalit Bandhu - Huzurabad By Election Results: తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసక్తికరంగా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించగా.. తొలి నాలుగు రౌండ్లలోనూ బీజేపీ దూసుకుపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీ 129 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఈ గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 182 ఓట్లు వచ్చాయి.

అయితే అంచనాలకు విరుద్ధంగా దళితబంధు ఓటర్లను ఆకట్టుకోకపోయిందనే భావన ఇప్పడు వెలువడుతోంది. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. మొత్తంగా ఈటలకు 2,958 ఓట్ల ఆధిక్యం లభించింది. నాలుగు రౌండ్లు కలిపి ఈటలకు 17,838 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 16,134 ఓట్లు వచ్చాయి. 

Tags:    

Similar News