Telangana Assembly : అసెంబ్లీ ముట్డడికి బీజేపీ నేతల యత్నం..అడ్డుకున్న పోలీసులు
Telangana Assembly : ఈరోజు నాలుగు చట్టాల సవరణ కోసం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభ ఉదయం 11గంటలకు 40నిమిషాలకు సభ ప్రారంభం అయింది. సరిగ్గా అదే సమయానికి బీజేపీ కార్యకర్తలు సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అనంతరం ఎల్ఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ , కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు.
దాంతో పాటుగానే జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నప్పటికీ పోటీ చేయవచ్చనే చట్టసవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలు తొలగించటాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రిజర్వేషన్లు చేయకుండా జీహెచ్ఎంసి ఎన్నికలకు వెళ్లకూడదని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉదృక్త వాతావరణం ఏర్పడడంతో బీజేపీ నేతల్ని, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. పలువుర్ని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. ఇక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం సీపీఐ, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కూడా అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు.
ఈరోజు నాలుగు చట్టాల సవరణ కోసం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఉదయం 11గంటలకు 40నిమిషాల సభ ప్రారంభం అవుతుంది. ప్రత్యెక సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు రద్దు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో... అవసరమైన జాగ్రత్తలు తీసుకున్న అధికారులు. ఎమ్మెల్యేల మద్య భౌతికదూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేసిన అధికారులు. నాలుగు చట్టాల సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదముద్ర వేసిన నాలుగు ముసాయిదా బిల్లులు ఈరోజు సభ ముందుకు రానున్నాయి.