Telangana: నేడు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం.. ఒకేరోజు 35 లక్షల కుటుంబాలను కలవనున్న బీజేపీ

Telangana: కరీంనగర్‌లో బండి సంజయ్‌ ఇంటింటికి బీజేపీ ప్రచారం

Update: 2023-06-22 04:27 GMT

Telangana: నేడు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం.. ఒకేరోజు 35 లక్షల కుటుంబాలను కలవనున్న బీజేపీ

Telangana: బీజేపీ 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేటి నుండి ఇంటింటికీ బీజేపీ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణను రూపొందించింది. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలవనున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంటింటికీ బీజేపీ పేరిట ప్రజలతో కలిసి కేంద్రప్రభుత్వం చేస్తున్న పనులను, పథకాలను వివరించనున్నారు.

తెలంగాణలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలున్నాయని అంచనా వేశారు. ప్రతి పోలింగ్ కమిటీ అధ్యక్షుడు తమ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో వంద కుటుంబాలను కలిసి నరేంద్రమోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రజలకు కలిగిన మేలును వివరించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. 

Tags:    

Similar News