Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తాం
Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తాం
Kishan Reddy: కాంగ్రెస్ బీఆర్ఎస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు అధికారంలోకి వస్తే ప్రజల చేతిలో చిప్ప వస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కవులు, కళాకారులు, మేధావులు ఆలోచించాలని ఆయన కోరారు. బీజేపీ మేనిఫెస్టోపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు.