సిద్దిపేట జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు అందని బిల్లులు

నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో ఇబ్బందులు ప్రభుత్వం తక్షణమే బిల్లులు చెల్లించాలని కోరుతున్న నిర్వాహకులు

Update: 2021-12-25 04:00 GMT

సిద్దిపేట జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు అందని బిల్లులు

Siddipet: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే నెల నెలా బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోయి, తీవ్ర అవస్థలు పడుతున్నారు.

సిద్దిపేట జిల్లాలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్న వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన బిల్లులు సకాలంలో అందడం లేదు. మరోవైపు నిత్యవసర సరుకులు, కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు. అప్పు చేసి విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని చెబుతున్నారు నిర్వాహకులు.

Tags:    

Similar News