Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..23,24,25 తేదీల్లో 70 రైళ్లు రద్దు..పూర్తి వివరాలివే

Cyclone Dana: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది రైల్వే శాఖ. దానా తుపాన్ నేపథ్యంలో ఈనెల 23,24,25 తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సుమారు 70 రైళ్లును రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు.

Update: 2024-10-23 00:34 GMT

దానా తుపాన్ ప్రభావంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 70 రైళ్లను క్యాన్సిల్ చేశారు. ఈ నెల 23,24,25, 27 తేదీల్లో సర్వీసులు అందించే రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలను సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హావ్ డా, భువనేశ్వర్, ఖరగ్ పూర్, పూరి తదితర చట్ల నుంచి ఇతర ప్రాంతాలకు సర్వీసులందించే రైళ్లే అధికంగా ఉన్నాయి. దానా తుపాన్ ప్రభావంతో అక్టోబర్ 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని..వర్షాలూ కురుస్తాయని గోపాల్ పూర్ ఐఎండీ అధికారులు వెల్లడించారు. సముద్రంలో కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచనలు జారీ చేశారు.

23వ తేదీ హైదరాబాద్ -హావ్ డా ఈస్ట్ కోస్టు, సికింద్రాబాద్ -హావ్ డా ఫలక్ నుమా, కన్యాకకుమారీ-డిబ్రూఘర్-కన్యాకుమారీ, ముంబై-భువనేశ్వర్ కోణార్క్, చెన్నై సెంట్రల్ హావ్ డా మెయిల్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ ప్రెస్ వంటి 18 రైళ్లను రద్దు చేశారు.

24న షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమాండల్, పాట్నా-ఎర్నాకుళం, హావ్ డా సికింద్రాబాద్ ఫలక్ నుమా, భువనేశ్వర్ -విశాఖ వందేభారత్, షాలిమార్ -వాస్కోడిగామా అమరావతి ఎక్స్ ప్ రెస్ వంటి 37 రైళ్లు, 25వ తేదీన విశాఖ అమ్రుత్ సర్, విశాఖ, భువనేశ్వర్, విశాక గుణుపూర్, విశాఖ బ్రహ్మపుర 11రైళ్లను రద్దు చేశారు.

Tags:    

Similar News