Bhatti Vikramarka: 108వ రోజుకు చేరుకున్న భట్టి విక్రమార్క పాదయాత్ర
Bhatti Vikramarka: పాదయాత్రలో భారీగా పాల్గొన్న మహిళలు
Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. భట్టి పాదయాత్రలో పెద్దఎత్తున యువతకులు,మహిళలు పాల్గొన్నారు. భట్టి యాత్రలో పాలేరు పీసీసీ ఇంఛార్జ్ రాయల నాగేశ్వరరావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ భట్టి ముందుకు సాగుతున్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పిస్తున్నారు. పాదయాత్రలో భాగంలో TUWJ నాయకులు ఆదినారాయణ, రామకృష్ణలతో కలిసి ఖమ్మం లెజెండ్స్ బుక్‌ను భట్టి ఆవిష్కరించారు.