Bhatti Vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతన్న భట్టి పాదయాత్ర
Bhatti Vikramarka: ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క.. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందటం లేదని భట్టికి ప్రజలు మొరపెట్టుకున్నారు. ఈ సారి కాంగ్రెస్ కు ఓటు వేస్తామని ఇంద్రవెల్లి ఆదివాసి, గిరిజన మహిళలు భట్టికి చెప్పారు. పాదయాత్రలో భాగంగా వడ్రంగి లక్ష్మణ్ ఇంటికి వెళ్లి కొలిమి చక్రం తిప్పారు భట్టి విక్రమార్క. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని..అన్ని పథకాలు అందేట్టు చేస్తానని భట్టి విక్రమార్క లక్ష్మణ్ కు హామినిచ్చారు.