Batti Vikramarka: సింగరేణిపై సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ
Batti Vikramarka: సింగరేణి మనుగడపై మన్ను పోసిందెవరు..?
Batti Vikramarka: సింగరేణిలో సమస్యలు, సవాళ్లపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిచ్చే సింగరేణిలో ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు.. వేల కోట్ల డిపాజిట్లతో లాభాల బాటలో ఉన్న సింగరేణి కోసం నేడు ఎందుకు అప్పుల కోసం బ్యాంక్‌ల చుట్టు తిరుగుతున్నారని నిలదీశారు... గ్రోత్ ఇంజిన్ లాంటి సింగరేణిపై మన్ను పోసిందెవరు...? అప్పుల ఊబిలోకి నెట్టిందెవరు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు భట్టి.