బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం

Bathukamma Sarees 2022: పంపిణీ చేసేందుకు కోటీ 18లక్షల బతుకమ్మ చీరలు రెడీ

Update: 2022-09-02 04:15 GMT

బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం

Bathukamma Sarees 2022: తెలంగాణ అడబిడ్డలు గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగను మహిళలు ఆత్మగౌరవంతో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరల పంపిణీ ఈ నెల 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చేనేత జౌళిశాఖ అధికారులు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలను ఆడబిడ్డలకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. చేనేతకు చేయూత నివ్వాలనే ఆలోచనతో సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల మరమగ్గాలపై తయారైన చీరలు లబ్ధిదారులకు అధికారులు పంపిణీ చేయనున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వెరైటీ డిజైన్ లను రూపొందించారు. ఈ ఏడాది 340 కోట్ల వ్యయంతో, కోటి 18 లక్షల చీరలను పంపిణీ చేయనున్నారు. అయితే ఇప్పటికే 50శాతం చీరలు జిల్లా కేంద్రాలకు చేరాయి.

సిరిసిల్లలో తయారైన బతుకమ్మ చీరలను పూర్తి స్థాయిలో వాషింగ్ ప్యాకింగ్ చేసేందుకు హైదరాబాద్ నగరంలో పలు మిల్లులకు తరలించారు. అయితే ఇక్కడ పూర్తిగా వాషింగ్‌తో పాటు ప్యాకింగ్ చేసి జిల్లా కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా బతుకమ్మ చీరలతో చాలా మందికి ఉపాధి లభిస్తుంది. 24 గంటల కరెంట్ ఉండడంతో 3 షిఫ్ట్‌లో కూలీలు పని చేస్తున్నారు.

గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు చేనేత బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈసారి 17 రంగులతో 30 రకాల వెరైటీలతో, 240 డిజైన్లతో, 800 వరకు కలర్ కాంబినేషన్లో  కోటికి పైగా చీరెలను పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మహిళల కోసం ప్రత్యేకంగా 9 గజాల పొడవు తో 8 లక్షల చీరలను రూపొందించారు. 

చీరలను బతుకమ్మ పండుగ ప్రారంభం కంటే 5 రోజుల ముందే పంపిణీ పూర్తి చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్‌లకు చీరెల పంపిణీపై అధికారులు వివరాలు అందిస్తున్నారు. 15వ తేదీ తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ షాపులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేపట్టనుంది ప్రభుత్వం. 

Tags:    

Similar News