బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఫుడ్ పాయిజన్..600మంది విద్యార్థులకు అస్వస్థత..

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Update: 2022-07-15 12:44 GMT

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఫుడ్ పాయిజన్..600మంది విద్యార్థులకు అస్వస్థత..

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ తిన్న 600 మంది విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. దీంతో విద్యార్థులను వెంటనే ఆర్జీయూకేటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థుల మెస్‌ల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు మెస్‌లకు ఒకే చోట భోజనం తయారు చేస్తారు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. క్రమంగా పలువురు స్పృహ తప్పి పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో నిర్మల్‌, భైంసా వైద్యులను రప్పించి చికిత్స అందించారు. స్పృహ తప్పి పడిపోయిన కొందరు విద్యార్థులను నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News