Bandi Sanjay on Telangana projects: నాణ్యత లేని నీటి ప్రాజెక్టులతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు

Bandi Sanjay on Telangana projects: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కుమార్ మరో సారి విమర్శల వర్షం కురిపించారు

Update: 2020-06-30 15:08 GMT

Bandi Sanjay on Telangana projects: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కుమార్ మరో సారి విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో లీకేజీల ప్రభుత్వం నడుస్తోందని బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేసారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీట్లాడుతూ నాణ్యత లేని నీటి ప్రాజెక్టులతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. సీఎం సొంత నిజయోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల ఇంకా ఎన్ని దారుణాలు, ఘోరాలు జరుగుతాయో అని అనుమానం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని ఆయన అన్నారు.

మొన్న కాళేశ్వరం, అంతకు ముందు మధ్య మానేరు, మల్లన్న సాగర్, ఇప్పుడు కొండపోచమ్మకు గండి పడిందని, ఇలా నాణ్యత లేని నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల ప్రజలు క్షణక్షణం బిక్కుబిక్కుమనాల్సిందేనని వ్యాఖ్యానించారు. స్కాముల కోసమే స్కీములు పెట్టారనేందుకు కొండపోచమ్మ కాలువకు పడిన గండీనే నిదర్శనమని ఆరోపించారు. కొందరు ప్రభుత్వ పెద్దల బినామీలు కాంట్రాక్టర్లు కావడమే ఈ లీకేజీలకు మూల కారణని ఆరోపించారు. ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గుత్తేదారు నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసి కాల్వకు తక్షణం మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారిపై వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలా నాణ్యత లేని నిర్మాణాలు చేపడుతుంటే విజిలెన్స్ డిపార్ట్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు.


Tags:    

Similar News