Bandi Sanjay: బండి సంజయ్ నిరసన దీక్ష ప్రారంభం
Bandi Sanjay: తన ఇంటి దగ్గర నిరసన దీక్షకు దిగిన బండి సంజయ్
Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష కొనసాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని తన నివాసం వద్ద సంజయ్ నిరసన దీక్షకు దిగారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. మరోవైపు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ పలువురు ముఖ్యనేతలు నిరసన దీక్షకు దిగారు. ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సినీనటి జీవితా రాజశేఖర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆ పార్టీ రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.