Bandi Sanjay: గంగుల వలే గుట్టలు మాయం చేశానా ?
Bandi Sanjay: మంత్రి గంగులపై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay: మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. గంగుల వలే గుట్టలు మాయం చేశానా అని ప్రశ్నించారు. తాను అవినీతి పరుడిని అయితే... జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఎలా ఇస్తారని అన్నారు. హెలికాప్టర్ ద్వారా ప్రచారం చేయిస్తున్న విషయం తెలియదా అని అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న గంగుల రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని అన్నారు. వడ్ల కొనుగోళ్లలో అక్రమాలు ఎందుకు ఆపలేదన్నారు. కరీంనగర్ జిల్లా చామనపల్లి గ్రామంలో బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు.