Bandi Sanjay: సీఎం సీఎం అన్నందుకే నా ఉన్న పోస్ట్ ఉడిపోయింది
Bandi Sanjay: జుక్కల్ లో బీజేపీ అభ్యర్థిని గెలుపించాలి
Bandi Sanjay: కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ అభ్యర్థి అరుణతార పాల్గొన్నారు. బిచ్కుందలో బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో సీఎం సీఎం అంటు కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కార్యకర్తలను బండి సంజయ్ వారించారు. సీఎం సీఎం అన్నందుకే నా పోస్ట్ ఉడిపోయిందన్నారు. మళ్లీ అంటే ఉన్న ఈ పోస్ట్ కూడా పోతుందన్నారు. సీఎంను ఎన్నుకునేది ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానమని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ లాగా బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదన్నారు. బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటేయ్యాలన్నారు.