Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే
Bandi Sanjay: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్లకుండా గ్యారెంటీ ఇవ్వాలి
Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్లకుండా గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఉద్యమం చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2వేల మంది బీజేపీ కార్యకర్తలపై రౌడీషీట్లు ఓపెన్ చేసిందని చెప్పారు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల రోడ్ షో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.