Bandi Sanjay: రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా... మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం
Bandi Sanjay: పేదల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది
Bandi Sanjay: కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచినా మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని బండి సంజయ్ జోస్యం చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని గెలిపించాలని ప్రజలను కోరారు. పేదల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. డబుల్ బెడ్ రూములకు నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమనీ... కానీ కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మేమే ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నాడని ఆరోపించారు.