Bandi Sanjay: కరెంట్ ఛార్జీలు మళ్లీ పెంచేందుకు కేసీఆర్ కుట్ర..

Bandi Sanjay: ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినపుడు హామీలను నిలబెట్టుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

Update: 2022-08-20 11:00 GMT

Bandi Sanjay: కరెంట్ ఛార్జీలు మళ్లీ పెంచేందుకు కేసీఆర్ కుట్ర..

Bandi Sanjay: ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినపుడు హామీలను నిలబెట్టుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పవర్ ఎక్చేంజ్‌లో విద్యుత్ కొనుగోలుచేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ఇబ్బంది పెట్టలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. బకాయిలను సకాలంలో చెల్లించి ఉంటే ఇబ్బందులొచ్చేవి కావన్నారు. డిస్కమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టడం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. డిస్కమ్‌లు కట్టాల్సిన బకాయిలు రూ.20వేల కోట్లకు పైగా ఉండగా.. కేవలం రూ.1380 కోట్లు మాత్రమే కట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని బండి పేర్కొన్నారు. కేవలం రూ.50 కోట్లే కట్టాల్సి ఉందంటూ ఓ అధికారి పెనాల్టీ గురించి మాత్రమే చెబుతున్నారన్నారు. రాష్ట్ర మంత్రేమో అసలు డబ్బులే కట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారని బండి సంజయ్‌ అన్నారు.

సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఫ్రీ కరెంట్ వినియోగిస్తూ సెప్టెంబర్ లో ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. పవర్ ఎక్సేంజ్ పేరుతో విద్యుత్ ను కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతుందని ఇలా చేస్తే ఏ రోజుకో ఆ రోజు ధర నిర్ణయిస్తారన్నారు. బకాయిలు సకాలంలో కట్టకపోవడంతో ప్రజలపై భారం పడే ప్రమాదం ఉందన్నారు. ఒక్క ఓల్డ్ సిటీలోనే 5వేల కోట్లకుపైగా బిల్లులు కట్టాల్సి ఉందన్నారు. ఇష్టం వచ్చినట్టు కరెంట్ కొనుగోళ్లు వద్దని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం చెప్పిందన్నారు. 

Tags:    

Similar News