Balapur: మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ
Balapur: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాట
Balapur: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో నాదర్‌గుల్ వాసి మర్రి శశాంక్‌రెడ్డి, కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ లడ్డూను 18 లక్షల, 90వేలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వీరితో 2019లో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి వేలంపాటకు వచ్చారు. ఆ సమయంలో 17లక్షల, 60 వేలకు రాంరెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికేతురులైతే అప్పటికప్పుడు చెల్లించాలి. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్ కారణంగా గతేడాది వేలంపాట జరగలేదు.
దేశ వ్యాప్తంగా బాలాపూర్ లడ్డు కు ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది వినాయక చవితికి వినాయకుడి లడ్డూను వేలం వేస్తారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి వేలంపాటలో ఈ లడ్డును దక్కించుకుంటుంటారు. గత ఏడాది కరోనా కారణంగా లడ్డు వేలంపాట జరగలేదు. ఈ ఏడాది రికార్డు ధర కు లడ్డు ను మర్రి శశాంక్ రెడ్డి దక్కించుకున్నారు.
బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో ఏర్పాటైంది. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. తొలిసారి జరిగిన వేలంపాటలో వ్యవసాయదారుడైన కొలను మోహన్ రెడ్డి కుటంబం 450 రూపాయలకు దక్కించుకున్నాడు. ఆ లడ్డును ఆయన పొలంలో చల్లాడు ఆ ఏడాది ఆర్థికంగా ఆయనకు కలిసిరావండంతో, 1995లో 4వేల500 లకు మరోసారి వేలంపాటలో లడ్డును దక్కించుకున్నాడు. ఆయనకు లడ్డు వేలం బాగా కల్సివచ్చింది. దీనితో లడ్డు ఎంతో మహిమలు కలదని, అంత మంచే జరుగుతుందనే నమ్మకంతో బాలాపూర్ లడ్డుకి భక్తుల్లో నమ్మకం పెరిగింది. ప్రతి ఏడాది వందల నుండి వేలు, వేలు నుండి లక్షలకు లడ్డు వేలంపాట చేరుకుంది.