'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కు రూ.25 కోట్లు: కేసీఆర్

Azadi Ki Amrut Mahotsav: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఘనంగా ఉత్సవాలు జరపాలన్న సీఎం కేసీఆర్

Update: 2021-03-11 14:28 GMT

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Azadi Ki Amrut Mahotsav: భరతమాత విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తి కావస్తున్నతరుణంలో కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట దేశవ్యాప్తంగా ఉత్సవాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలోనూ ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం 25 కోట్లు కేటాయించింది.

రేపటి నుంచి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రేపు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోనూ, వరంగల్ పోలీస్ గ్రౌండ్స్ లోనూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్, వరంగల్‌లో జరిగే కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

Tags:    

Similar News