గ్రేటర్ వరంగల్ కు మరో అరుదైన అవార్డు

*75 గంటల్లోనే పార్క్ నిర్మించినందుకు గుర్తింపు

Update: 2022-05-06 03:26 GMT

గ్రేటర్ వరంగల్ కు మరో అరుదైన అవార్డు

Warangal: గ్రేటర్ వరంగల్ కు మరో అరుదైన అవార్డు లభించింది. స్మార్ట్ సిటీ ఛాలెంజ్‌లో భాగంగా MH నగర్‌లో 75 గంటల్లోపు పార్క్ నిర్మించినందుకు అవార్డ్ దక్కినట్లు స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించింది. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రెండు విడతలలో నిర్వహించిన పోటీలలో దేశవ్యాప్తంగా 43 నగరాలు పోటీలో పాల్గొన్నాయి. ఇందులో ఆరు న‌గ‌రాలు విజేత‌లుగా నిల‌వ‌గా గ్రేటర్ వరంగల్ ఒక‌టి కావ‌డం విశేషం. వ‌రంగ‌ల్‌తో పాటు భువనేశ్వర్, ఇంఫాల్, కొహిమా, శ్రీనగర్ పింప్రి-చించ్వాడ్ కు అవార్డులు ద‌క్కాయి.

ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 13వ డివిజన్ స్ల‌మ్ ఏరియా MH నగర్ లో పార్క్ నిర్మాణం చేపట్టారు. 75 గంటల్లో పార్కు నిర్మాణం లక్ష్యం పెట్టుకోగా 56 గంట‌ల్లోనే పార్క్ నిర్మించారు. దీంతో గ్రేటర్ వరంగల్ నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఈ ప్రాంతమంతా మురికి, నీరు, చెత్త చెదారం పేరుకుపోయి కుప్పలు కుప్పలుగా ఉండేది. ప్రస్తుతం చిట్టి పార్క్ నిర్మించడంతో తమ ప్రాంతమంతా శుభ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. పిల్లలు ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారని చెప్తున్నారు.

Tags:    

Similar News