హైదరాబాద్‌ మీర్‌పేట్‌ డిప్యూటీ మేయర్‌ విక్రమ్‌పై దాడి

* డిప్యూటీ మేయర్ పై దాడి చేసిన 10వ డివిజన్ కార్పొరేటర్ అనుచరులు * నేడు మీర్‌పేట్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్

Update: 2021-08-13 02:15 GMT
Attack on Meerpet Deputy Mayor Vikram in Hyderabad

మీర్‌పేట్‌ డిప్యూటీ మేయర్‌ విక్రమ్‌ (ఫైల్ ఫోటో)

  • whatsapp icon

Hyderabad: హైదరాబాద్‌ మీర్‌పేట్‌ డిప్యూటీ మేయర్‌ విక్రమ్‌పై 10వ డివిజన్‌ కార్పొరేటర్ ముద్ద పవన్‌కుమార్‌ దాడి చేశారంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నేటి నుంచి మీర్‌పేట్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరుగనుంది. ఈ మేరకు కొందరు కార్పొరేటర్స్‌తో గురువారం జిల్లెలగూడలోని ఓ ప్రైవేట్‌ స్కూళ్లో డిప్యూటీ మేయర్ సమావేశం అయ్యారు. విషయం తెలుసుకున్న 10వ డివిజన్‌ కార్పొరేటర్ తన అనుచరులతో కలిచి వచ్చి దాడి చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్‌ కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

Tags:    

Similar News