మాస్కు ఉంటేనే స‌భ‌లోకి అనుమ‌తి : స్పీకర్ పోచారం

Update: 2020-09-04 12:33 GMT
మాస్కు ఉంటేనే స‌భ‌లోకి అనుమ‌తి : స్పీకర్ పోచారం
  • whatsapp icon

Pocharam Srinivas Reddy: కరోనా పరీక్షల్లో పాజిటివ్ వస్తే అసెంబ్లీకి రావద్దని సూచించారు శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీసుకోవాల్సిన కరోనా జాగ్రత్తలపై శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు పోచారం. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. మాస్కు ఉంటేనే స‌భ‌లోకి అనుమ‌తి ఉంటుంద‌ని తేల్చిచెప్పారు. జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు ఉంటే అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి అనుమ‌తించరు. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణంగా ఉంటేనే అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు, మంత్రుల పీఎస్‌లు, పీఏలు త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఎమ్మెల్యేల పీఏల‌ను అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి అనుమ‌తించ‌రు అని స్పీక‌ర్ తెలిపారు. అన్ని ప్ర‌వేశాల వ‌ద్ద థ‌ర్మ‌ల్ స్క్రీన‌ర్లు ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలకు ఒక ప్రత్యేకత వుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా కరోనా మరణాలు తగ్గాయన్నారు. సభ రోజు ఉదయం, సాయంత్రం శానిటైజ్ చేస్తాం. సభలోని మైక్ కూడా రోజు శానిటైజ్ చేస్తాం. 20 నుంచి 21 రోజులు సభ నడువొచ్చు అనుకుంటున్నాం. ప్రభుత్వం తరుపున శాసన సభ్యులు, మండలి సభ్యులకు కిట్ ఇస్తున్నాం. అందులో ఆక్సి మీటర్, శానిటైజేర్ ఇస్తున్నాం. ఆక్సిజన్ పర్సెంటేజ్ 90 లోపు ఉంటే సభకు రావొద్దు. ఈ సెషన్‌కు విజిటర్స్‌కు అనుమతి లేదు అని స్పీకర్ వెల్లడించారు.


Tags:    

Similar News