TG Groups-1: గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్.. తొలగిన అడ్డంకి.. యాథావిధిగా మెయిన్స్ పరీక్షలు

TG Groups-1: తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్ 1 పరీక్షలకు అడ్డంకులు తొలగిపోయాయి. పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది

Update: 2024-10-15 06:54 GMT

TG Groups-1: గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్.. తొలగిన అడ్డంకి..యాథావిధిగా మెయిన్స్ పరీక్షలు

TG Groups-1: తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్ 1 పరీక్షలకు అడ్డంకులు తొలగిపోయాయి. పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈనెల 21 నుంచి యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది కీలో సరైన జవాబులు ఇవ్వలేదని, 7 ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరుతూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. కానీ ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. కోర్టులో పిటిషన్ల అడ్డంకి తొలగిపోవడంతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. 

Tags:    

Similar News