New Ration Card: కొత్త రేషన్‌కార్డు ఎలా పొందాలి.. ఏయే డాక్యుమెంట్లు అవసరం..?

New Ration Card: పేద, మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వం అందించే రేషన్‌ కార్డు ఒక వరంలాంటిది.

Update: 2022-06-06 08:00 GMT

New Ration Card:కొత్త రేషన్‌కార్డు ఎలా పొందాలి.. ఏయే డాక్యుమెంట్లు అవసరం..?

New Ration Card: పేద, మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వం అందించే రేషన్‌ కార్డు ఒక వరంలాంటిది. దీనివల్ల వారు మూడు పూటల తిండి తినగలుగుతున్నారు. కరువు, కాటకాలు, తుఫానులు, వరదలు వచ్చినా ఈ ప్రజలని ఆదుకునేది రేషన్‌పై వచ్చే సబ్సిడీ సరుకులే. అందుకే పేద వర్గాలకి రేషన్‌ కార్డు అనేది చాలా ముఖ్యం. అంతేకాదు రేషన్‌ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సబ్సీడీ ధరకు రేషన్ సరుకులను పొందటమే కాదు. ఆరోగ్య శ్రీ, పలు రకాల ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు రేషన్ కార్డు సంజీవనిగా మారింది. అయితే తెలంగాణలో రేషన్‌కార్డుకి ఎలా అప్లై చేయాలి. కావలసిని డాక్యుమెంట్లు ఏంటో తెలుసుకుందాం.

వాస్తవానికి రేషన్‌ కార్డులో 2 రకాలు ఉంటాయి. ఒకటి వైట్ రేషన్ కార్డు. రెండు పింక్ రేషన్ కార్డు. ఆర్థిక స్థోమత ఆధారంగా పావర్టీ లైన్‌కి దిగువన ఉన్నవారికి వైట్ కార్డు ఇస్తారు. పావర్టీ లైన్‌కి ఎగువన ఉన్నవారికి పింక్ కార్డు తీసుకునే సౌలభ్యం ఉంది. అయితే వీరు సబ్సిడీ ధరకు రేషన్ సరుకులు కొనలేరు. కాగా ఏ ప్రాసెస్‌లో అర్జీ పెట్టుకున్నా కార్డు రావడానికి వారం లేదా రెండు వారాల టైమ్ పడుతుంది. కొత్తగా రేషన్‌ కార్డు కోసం అప్లై చేయాలనుకునేవారు మొదట మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు ఫారమ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ముందుగా మీరు మీసేవా వెబ్ సైట్ ఓపెన్ చేసాక మీసేవా సర్వీస్ ఫార్మ్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో వివిధ రకాల డిపార్ట్ మెంట్స్ ఫార్మ్స్ కనిపిస్తాయి. అలాకాకుండా నేరుగా tg.meeseva.gov.in/DeptPortal/Meeseva-Applications లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్ మెంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకున్నాక.. అప్లై న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేదానిపై సెలక్ట్ చేయాలి. అనంతం దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసుకొని ఫారంను ఫ్రింట్ తీసుకోవాలి. ముందుగా ఫారంలో స్పష్టమైన సమాచారాన్ని భర్తీ చెయ్యాలి. అంటే దరఖాస్తుదారుడి పేరు, వయస్సు, తండ్రి పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, జిల్లా, ఫ్యామిలీ మెంబర్స్ నంబర్స్ ఇలా అన్ని వివరాలను జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‏ను జతచేయాలి.

ఏ పత్రాలు అవసరం..?

1. ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు ప్రూఫ్. దరఖాస్తుదారుడి పాస్‏పోర్ట్ సైజ్ ఫోటో

2. సంతకం లేదా వేలిముద్ర విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే లైఫ్‌ లాంగ్‌ ఇదే ఉంటుంది. ఫీజును, దరఖాస్తు ఫారంను మీసేవలో సబ్‌మిట్ చేయండి. అప్పుడు మీ సేవ వారు మీకు అక్నాలెడ్జ్ స్లిప్ ఇస్తారు. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి.

3. మొబైల్‌ నెంబర్‌కు రేషన్‌కార్డు మంజూరైనట్లు మెస్సేజ్‌ వస్తుంది. ఆ వెంటనే మీరు అప్లై చేసిన మీ సేవ కేంద్రానికి వెళ్లి అక్నాలెడ్జ్ స్లిప్ చూపిస్తే మంజూరైన రేషన్ కార్డును డౌన్‌లోడ్‌ చేసి ఇస్తారు.

 Also Read

Ration Card Rules: మీకు వివాహమైతే రేషన్‌ కార్డు త్వరగా అప్‌డేట్‌ చేయండి.. ఎందుకంటే..?

రేషన్‌ కార్డుదారులకి గమనిక.. డీలర్ తక్కువ రేషన్‌ ఇస్తే ఈ నెంబర్లకి ఫోన్‌ చేసి కంప్లయింట్ ఇవ్వొచ్చు..!

Tags:    

Similar News