AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్..మూడు రోజులు అతి భారీ వర్షాలు
AP Telangana Weather Updates : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై ఐఎండీ కీలక అప్ డేట్ ఇచ్చింది. పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
నేడు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది.
ఇక తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని..హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 3వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.