AP-Telangana Border: బోర్డర్‌లో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆంక్షలు

AP-Telangana Border: తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలను పోలీసులు కఠినతరం చేశారు.

Update: 2021-05-23 07:36 GMT

AP-Telangana Border: బోర్డర్‌లో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆంక్షలు

AP-Telangana Border: తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలను పోలీసులు కఠినతరం చేశారు. ఏపీ నుంచి వచ్చేవారికి ఈ-పాస్‌ తప్పనిసరి చేశారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. అత్యవసర వాహనాలకు కూడా గుర్తింపు కార్డును తప్పనిసరి చేశారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం ఎక్స్‌ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. లాక్‌డౌన్ సడలింపు ఉందని వాహనాలు భారీగా తరలివచ్చాయి. అయితే ఈ-పాస్ ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ-పాస్ లేని వాహనదారులను నిలిపివేయడంతో సరిహద్దుల వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సరుకు రవాణా వాహనాలకు కూడా 10 గంటల తర్వాత అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

తెలంగాణ- ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఏపీ నుంచి అంబులెన్స్, సరకు రవాణా, అత్యవసర, ఈ-పాస్‌లున్న వాటిని మినహా ఇతర వాహనాలను వేటిని తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. దీంతో అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్ల కోదాడ మండలం రామాపూర్ చెక్‌పోస్టుతో పాటు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని పూల్లూరు టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

లాక్‌డౌన్‌ సడలింపు ఉంటుందన్న భావనతో ఏపీ నుంచి భారీగా వాహనదారులు తరలివచ్చారు. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ పోలీసులను ఆదేశించడంతో ఈ మేరకు పోలీసుశాఖ దృష్టిపెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉండటంతో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని పుల్లూరు టోల్ ప్లాజా వద్దభారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు అనుమతికి సంబంధించిన ఈ-పాస్ లేకపోవడంతో ఏపీ నుంచి వస్తున్న వాహనాలను టోల్ గేట్ వద్ద ఆపేస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలు మాత్రమే తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు. 

Tags:    

Similar News