ఏపీ-తెలంగాణ సరిహద్దుల దగ్గర ఏపీ ఆర్టీసీ బస్సులు : మంత్రి పేర్ని నాని

Update: 2020-10-24 08:11 GMT
ఏపీ-తెలంగాణ సరిహద్దుల దగ్గర ఏపీ ఆర్టీసీ బస్సులు : మంత్రి పేర్ని నాని
  • whatsapp icon

దసరాకు అయినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో బస్సులు నడుస్తాయని అందరూ భావించారని.. కానీ.. అది జరగలేదని అన్నారు మంత్రి పేర్ని నాని. ఏపీకి రావాల్సిన ప్రజలు తెలంగాణ సరిహద్దు వరకు చేరుకుంటే అక్కడి నుంచి తమ తమ ఊళ్లకు చేరవేసేందుకు బస్సులను సిద్ధం చేశామని స్పష్టం చేశారు. మంగళవారం టీఎస్ ఆర్టీసీతో జరిగే చర్చల్లో అయినా ఓ క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నామన్నారు మంత్రి పేర్ని నాని.

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు మంత్రి పేర్ని నాని. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.. సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రోడ్లపై గుంతలకు, జరిమానాలకు సంబంధమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతుల కోసం సీఎం జగన్ రెండువేల 500 కోట్లు మంజూరు చేశారని స్పష్టం చేశారు మంత్రి పేర్ని నాని.

దసరా సందర్భంగా ఏపీ-తెలంగాణ సరిహద్దుల దగ్గర ఏపీ ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామని అన్నారు మంత్రి పేర్ని నాని. జూన్‌ 18 నుంచి టీఎస్‌ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ కార్యాలయానికి సెలవులు కావడంతో నిర్ణయంలో జాప్యం అయిందన్నారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడుకు బస్సులు పునరుద్ధరించామన్న నాని టీఎస్ ఆర్టీసీతో పూర్తిస్థాయి చర్చలు అనంతరం బస్సులు నడుపుతామని అన్నారు. ఆర్టీసీ లాభనష్టాలు చూడట్లేదని ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.

Full View


Tags:    

Similar News