తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తుల జయంతి ఉత్సవాలను తగిన రీతిలో నిర్వహిస్తోందని. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.టి.రామారావు అన్నారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుతో సహా పలువురు తెలంగాణ ప్రముఖ వ్యక్తులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు గౌరవించలేదని, వారిని విస్మరించారని ఆయన అన్నారు. భారత మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా పీవీకి భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచారు. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించాలని ఆయన కోరారు. పీవీ ఒక్కరే కాదు తెలంగాణకు చెందిన ఎంతోమంది మందివైతాళికులను మరచిపోయారని, వారి ఉనికి మరుగునపడిందన్నారు. వారిని గుర్తించి గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
పీవీ నరసింహరావు అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. భూసంస్కరణలు మొదలు పెట్టి పేదలకు తన భూమిని పంచిన మహానుభావుడు పీవీ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఏ రంగంలో తనకు బాధ్యతలు అప్పజెప్పిన ఆ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. పివి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పురస్కారాలను తెచ్చిపెట్టిందని కెటిఆర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అతని తల్లితండ్రులు పివికి గొప్ప అభిమానులని తెలిపారు. రాష్ర్ట ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు పూర్తయిందని, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈశ్వరీభాయి, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, దొడ్డి కొమురయ్య, పైడి జయరాజ్, చాకలి ఐలమ్మ లాంటి ఎందరినో తెలంగాణ సాంస్కృతిక శాఖ గౌరవించుకుందన్నారు. వీరి స్ఫూర్తిని భవిష్యత్ తరాల్లో నింపాలని ఆయన పేర్కొన్నారు.