Adilabad: అడవుల్లో బయటపడ్డ పురాతన ఆలయం
Adilabad: జైనథ్ మండలం గిమ్మా శివారులో ఆలయం గుర్తింపు * వెయ్యి ఏళ్ల క్రితం నాటి ఆలయంగా చెబుతున్న చరిత్రకారులు
Adilabad: ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పురాతన ఆలయం బయటపడింది. జైనథ్ మండలం గిమ్మా గ్రామ శివారులో ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆలయం వేయేళ్ల క్రితం నాటి ఆలయమని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఈ ఆలయాన్ని రాక్షసరాజులు నిర్మించినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో నాగదేవత, గణపతి దేవుడుతోపాటు పలు రాతి విగ్రహాలు ఉన్నాయి. అయితే ఆలయ ముఖద్వారం తూర్పువైపు కాకుండా పడమరవైపు నిర్మాణం చేపట్టడంతోనే ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆపేసినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.