Anasuya: ఇదెక్కడి న్యాయం...కేటీఆర్‌ను ప్రశ్నించిన యాంకర్ అనసూయ..
Anasuya: కరోనా కారణంగా చాలా కాలంగా మూతపడిన స్కూళ్లు ఇటీవలే తెరుచుకున్న సంగతి తెలిసిందే.
Anasuya: కరోనా కారణంగా చాలా కాలంగా మూతపడిన స్కూళ్లు ఇటీవలే తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని స్కూళ్లు మాత్రం పిల్లలకు ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదంటూ తల్లిదండ్రుల దగ్గర్నుంచి డిక్లరేషన్ ను తీసుకుంటున్నాయి. దీనిపై నటి, ప్రముఖ యాంకర్ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అనసూయ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
డియర్ కేటీఆర్ సర్.. ఎందుకు లాక్‌డౌన్ చేశారో.. ఎందుకు తీసేశారో అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్లందరూ వ్యాక్సిన్ వేసుకున్నారని భరోసా ఇవ్వొచ్చు.. కానీ పిల్లల పరిస్థితి ఏంటి సర్?.. స్కూల్‌లో ఉన్నప్పుడు పిల్లలకు ఏమైనా జరిగితే వారు బాధ్యులు కారని సంతకం చేసిన పేపర్ పంపమని పాఠశాలలు ఎందుకు బలవంతం చేస్తున్నాయి.. చెప్పండి సర్.. ఇది ఎంతవరకు న్యాయం.. మీరు మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది.