గజ్వేల్ లో అమూల్ పాలసంస్థ కార్యకలాపాలు.. పరిశ్రమల హబ్ గా మార్చేందుకు...
Gajwel - Amul: వర్గల్, బొల్లారం పరిసరాల్లో కానుకగా వెయ్యి ఎకరాల విస్తీర్ణం...
Gajwel - Amul: అమూల్ పాల ఉత్పత్తుల సంస్థ తాజాగా తన కార్యకలాపాలను గజ్వేల్ కూ విస్తరించింది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో అమూల్ పాల ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు కు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే వర్గల్ , ములుగు ,మండలంలో వెయ్యి కి పైగా ఎకరాల స్థలాన్ని సేకరించారు. TSIIC ఈ ప్రాజెక్టుని అప్పగించింది అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ జోన్ ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్ కు సమీపంలో గజ్వేల్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.. ఈ ప్రాంతాన్ని పరిశ్రమల హబ్ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తునికి బొల్లారం లో 340 సర్వే నంబర్ లో 400 ఎకరాలను సేకరించి తెలంగాణ పరిశ్రమల శాఖ కు అప్పగించారు. మరియు వర్గల్ మండలం లో 800 ఎకరాలు ములుగులో 320 ఎకరాలు సేకరించారు.
అమూల్ కేంద్రాన్ని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ గా పరిగణిస్తూ కాలుష్య రహిత ఆహార శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే జోన్ లో ములుగు నుండి వర్గల్ కు వచ్చే మార్గం లో 50ఎకరాల్లో అమూల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అద్వర్యం లో స్థలం సేకరణ పనులు పూర్తీ అయితే పనులు ప్రారంభం చేస్తే రెండు సంవత్సరాలలో అమూల్ ప్లాంట్ అందుబాటులోకి రానుంది.
ప్రాథమికంగా రెండు రోజు తోలి దశలో రోజుకు అయిదు లక్షల లీటర్ల పాలు సేకరించనున్నారు. ఆ తర్వత పది లక్షల లీటర్ల కు సామర్ధ్యాన్ని పెంచనున్నారు. మజ్జిగ. పెరుగు. లస్సి. పన్నీరు. స్వీట్లు బిస్కెట్లు వంటి పలు రకాల ఉత్పత్తులు చేపట్టనున్నారు వీటికి అవసరం ఉన్న పాలను ఉమ్మడి జిల్లా నుండి సేకరించనున్నారు, దింతో పాలకు చాలా డిమాండ్ పెరగనుంది ఈ క్రమం లో ఈ ప్రాంత వాసులు అమూల్ కేంద్రం ఏర్పాటు పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ ప్లాంటు ఏర్పాటు శుభ పరిణామమని సీఎం కేసీఆర్ కు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. ఈ ప్రాంత ప్రజలకు అమూల్ ఓ వరం లాంటిది అని దీని ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయని నిరుద్యోగులకు అవకాశాలు ఎన్నో ఉంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.