Amit Shah: అర్వింద్ పోరాటంతోనే మోడీ ఇక్కడికి వచ్చి పసుపు బోర్డును ప్రకటించారు
Amit Shah: కేంద్రంతో గొడవ పెట్టుకొని పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి
Amit Shah: కోరుట్ల బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్.. పట్టుబట్టి పసుపు బోర్డును సాధించారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్రంతో గొడవ పెట్టుకొని పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేశారన్నారు. అర్వింద్ పోరాటంతోనే ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చి టర్మరిక్ బోర్డును ప్రకటించారని అమిత్ షా గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మూడు షుగర్ ఫ్యాక్టరీలను కూడా రీఓపెన్ చేస్తామన్నారు. ఎన్నారై పాలసీ కోసం అర్వింద్ కోరుతున్నారని,, ఎన్నారైల కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.