Amit Shah: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మూడు షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తాం
Amit Shah: బీఆర్ఎస్ పాలనలో అన్ని కుంభకోణాలే
Amit Shah: ఉత్తర తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోడీ నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ సకల జనుల సంకల్ప సభ నిర్వహించారు. ఎంపీ అరవింద్ కోట్లాడి పసుపు బోర్డు సాధించుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ జిల్లాలోని మూడు షుగర్ ఫ్యాకర్టీలను తిరిగి ప్రారంభిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.