TS DSC: ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే డీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

TS DSC: తెలంగాణలో డీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహా రెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలను తొలిసారిగా ఆన్ లైన్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Update: 2024-07-06 01:54 GMT

TG DSC: డిసెంబర్ లో టెట్, ఫిబ్రవరిలో మరో డీఎస్సీ..రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

TS DSC:తెలంగాణలో డీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహా రెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలను తొలిసారిగా ఆన్ లైన్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ఆప్పీళ్లను స్వీకరిస్తున్నామని కమిషనర్ ఈవీ నర్సింహా రెడ్డి తెలిపారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత అధికారులత వర్చువల్ గా సమావేశాన్ని నిర్వహించి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

డీఎస్సీ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ను ఉదయం 10.30లోపు నమోదు చేయాలని..దీనినే మధ్యాహ్న భోజనానికి పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. బడిబాట ఎన్ రూల్ మెంట్ ను ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్ డేట్ చేయాలన్నారు. రెండో జత యూనిఫాంలను వెంటనే కొట్టించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథఖం వివరాలను రోజూ ఆన్ లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలను తొలిసారిగా ఆన్ లైన్లో నిర్వహించనున్నారు. సీబీఆర్టీ విధానంల రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. జులై 18న మొదటి షిష్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్ షిఫ్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22 వరకు పలు మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈ పరీక్షలకు 2.79లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 

Tags:    

Similar News