Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లో రేపే పోలింగ్

Nagarjuna Sagar: తెలంగాణలో ఉత్కంఠ కలిగిస్తున్న నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు, సర్వం సిద్దమైంది.

Update: 2021-04-16 16:00 GMT

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లో రేపే పోలింగ్

Nagarjuna Sagar: తెలంగాణలో ఉత్కంఠ కలిగిస్తున్న నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు, సర్వం సిద్దమైంది. మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు పోలీసు అధికారులు.

నాగార్జున ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నోముల నర్సింహయ్య అకాల మరణంతో, బైపోల్ అనివార్యమైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు అనేక చిన్నా చితక పార్టీలు, ఇండిపెండెంట్లు బరిలో వున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీలో వుండటంతో, మూడు మూడు ఈవీఎంలను వినియోగించనున్నారు.

నాగార్జున సాగర్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 20 వేల 206. ఇందులో పురుషులు లక్షా 9 వేల 136 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య లక్షా 11 వేల 10. నాగార్జున సాగర్‌లో మొత్తం ఏడు మండలాలున్నాయి. గుర్రంపోడు మండలంలో ఓటర్ల సంఖ్య 34, 697. పెద్దవూర 44,783, తిరుమలగిరి సాగర్ 31,510, అనుముల 33,486, నిడమనూరు 34,256, మాడ్గులపల్లి 7,233, త్రిపురారంలో 33 వేల 881 మంది ఓటర్లు. 44,783 మంది ఓటర్లతో అతిపెద్ద మండలం పెద్దవూర. 7,233 ఓటర్లతో అతిచిన్న మండలం మాడ్గులపల్లి.

సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌‌కు నియమించిన సిబ్బంది 1500 మంది. ముప్పై మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్‌కు 210 మంది, మెడికల్ సిబ్బంది 710, 44 మంది సెక్టార్ ఆఫీసర్లు , 44 మంది‌ రూట్ ఆఫీసర్లు, 95 మంది డ్రైవర్లు ఎన్నికల పోలింగ్‌లో పాల్గొంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు, సాగర్‌ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్‌ సింగ్ చెప్పారు.

మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాల్లో నాలుగు వేల‌మందితో భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నారు నల్గొండ డీఐజీ రంగనాథ్. 108 సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన సెక్యూరిటీ వుందన్నారు. నాగార్జున సాగర్‌కు ‌2018లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే నమోదైన పోలింగ్ శాతం 86.44. బైపోల్‌లో ఏ మేరకు పోలింగ్‌ శాతం నమోదవుతుందో చూడాలి.

Tags:    

Similar News