భూమా అఖిలప్రియకు బెయిల్ ఇవ్వద్దని పోలీసుల కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశముందని భావించిన పోలీసులు ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని పిటిషన్‌లో కోరారు. అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశ్యం తమకు లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రత్యక్ష్య సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని అఖిల ప్రియ బెయిల్‌పై వస్తే సాక్ష్యులను బెదిరించే అవకాశముందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అఖిలప్రియకు ఆర్ధికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందని అఖిలప్రియ బెయిల్‌పై విడుదలైతే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.