సీడీఎస్ రావత్ మృతి కేసులో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ - ఎయిర్ చీఫ్ మార్షల్
Army Chopper Crash - Air Chief Marshal: దర్యాప్తుకు చెందిన అంశాలను వెల్లడించలేను - - ఎయిర్ చీఫ్ మార్షల్
Army Chopper Crash - Air Chief Marshal: తమిళనాడులోని కూనురు వద్ద జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ జనరల్ రావత్‌తో పాటు మొత్తం 14 మంది మృతి చెందారు. అయితే ఆ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చాలా నిష్పక్షపాతంగా జరుగుతున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ తెలిపారు.
హైదరాబాద్‌లోని దుండిగల్ వైమానిక దళ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీడీఎస్ రావత్ దంపతులు, మరో 12 మంది రక్షణదళ సిబ్బంది మృతి పట్ల ఆయన నివాళి అర్పించారు. సీడీఎస్ రావత్ మృతి కేసులో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చాలా ఫెయిర్‌గా జరుగుతోందన్నారు. అయితే ఇప్పుడు ఆ దర్యాప్తుకు చెందిన అంశాలను వెల్లడించలేనన్నారు.