ఈటల వస్తానంటే ఎందుకు చేర్చుకోలేదు.. భట్టి వ్యాఖ్యలపై కేసీ వేణుగోపాల్‌ ఆగ్రహం..

Congress: ఢిల్లీ వార్‌రూమ్ సాక్షిగా తెలంగాణ నేతల మాటల సిగపట్లు పడుతున్నారు.

Update: 2021-11-13 12:11 GMT

ఈటల వస్తానంటే ఎందుకు చేర్చుకోలేదు.. భట్టి వ్యాఖ్యలపై కేసీ వేణుగోపాల్‌ ఆగ్రహం..

Congress: ఢిల్లీ వార్‌రూమ్ సాక్షిగా తెలంగాణ నేతల మాటల సిగపట్లు పడుతున్నారు. హుజూరాబాద్ ఓటమికి మీరంటే మీరే కారణం అని వాదులాడుకున్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ పోటీ చేస్తే కేవలం 3 వేల ఓట్లు మాత్రమే రావడం ఏంటన్న ప్రశ్నలతో నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఈ సమావేశంలో టీకాంగ్రెస్ నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈటలను పార్టీలో చేర్చుకొని ఉంటే బాగుండేదని, ఆయన్ను కాంగ్రెస్‌లోకి రానివ్వకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. కాగా, భట్టి వ్యాఖ్యలపై కేసీ వేణుగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలను పార్టీలోకి తీసుకోవద్దని భట్టి విక్రమార్కే చెప్పారని, తిరిగి ఇతరుల మీద నిందలు వేస్తున్నారని వేణుగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు కాంగ్రెస్‌లో కొందరు నేతలు అధికార టీఆర్ఎస్‌కు సహకరిస్తున్నారని సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. కౌశిక్‌ రెడ్డి పార్టీ వీడేందుకు ఉత్తమ్‌ సహకరించారన్న పొన్నం కౌశిక్‌రెడ్డికి ఆయనే ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని ఆరోపించారు. హుజూరాబాద్‌తోపాటు దుబ్బాక, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఫలితాలపైనా సమీక్ష జరపాలని కేసీ వేణుగోపాల్‌ను పొన్నం ప్రభాకర్‌ కోరారు.

ఇదిలా ఉంటే హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ను ఎవరు రిఫర్ చేశారంటూ కాంగ్రెస్ సానియర్ నేత వీహెచ్ ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఫలితంపై మూకుమ్మడిగా కదు.. ఒక్కొక్కరిని విడి విడిగా పిలిచి అడగాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిన నాలుగు నెలల వరకూ హుజూరాబాద్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇదిలా ఉంటే సోనియా, రాహుల్ గాంధీలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇవాల్టి సమావేశానికి తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని లేఖలో ఫైర్ అయ్యారు. ఇక సాయంత్ర ఆరు గంటలకు మరోసారి కేసీ వేణుగోపాల్ ఒక్కొక్కరితో భేటీ కానున్నారు.

Tags:    

Similar News