Agnipath Protest: అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరాలని.. సికింద్రాబాద్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతు బిడ్డ రాకేశ్ వివరాలివే!

Agnipath Protest: అగ్నిపథ్ ఆందోళనలతో హైదరాబాద్ అట్టుడికింది.

Update: 2022-06-17 12:00 GMT

Agnipath Protest: అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరాలని.. సికింద్రాబాద్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతు బిడ్డ రాకేశ్ వివరాలివే!

Agnipath Protest: అగ్నిపథ్ ఆందోళనలతో హైదరాబాద్ అట్టుడికింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగమైంది. ఆర్మీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. భారీగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌కు తరలివచ్చిన యువకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైల్వేస్టేషన్ లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు పట్టాల మధ్యలో పార్సల్ సమాన్లు వేసి నిప్పుపెట్టారు. రైళ్లకు నిప్పెట్టారు. ఒకస్థాయిలో పరిస్థితి చేయి దాటిపోయింది.

దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రైల్వేస్టేషన్ లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆందోళనకారులపై 15 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్ లో జరిగిన పోలీసుల కాల్పుల్లో చనిపోయిన యువకుడిని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్ పేటకు చెందిన రాకేష్ గా గుర్తించారు. రాకేష్ ది రైతు కుటుంబం. రాకేష్‌ చనిపోయాడన్న వార్తతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.

రాకేష్ తండ్రి కుమారస్వామి రైతు. ఇతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. రాకేష్ చిన్నవాడు. రాకేష్ సోదరి బిఎస్ఎఫ్ జవాన్ గా పశ్చిమబెంగాల్లో పనిచేస్తోంది. అక్క ప్రోత్సాహంతోనే ఆర్మీలో చేరాలని కఠోర సాధన చేశాడు రాకేశ్. హైదరాబాద్ కు మూడు రోజుల క్రితం వచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో రాకేశ్ మరణించాడని స్థానిక పోలీసులు అతడి కుటుంబీకులకు తెలిపారు. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. రాకేష్ తల్లిదండ్రులను పోలీసులు సికింద్రాబాద్ తీసుకెళ్లారు. రాకేష్ మృతితో దబీర్ పేటలో తీవ్ర విషాదం అలుకుముంది.

Full View


Tags:    

Similar News