Telangana: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. 28 నుంచి కొత్త రేషన్‌ దరఖాస్తుల స్వీకరణ.. ఏ పత్రాలుకావాలంటే?

Ration Cards: రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

Update: 2023-12-23 15:30 GMT

Telangana: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. 28 నుంచి కొత్త రేషన్‌ దరఖాస్తుల స్వీకరణ.. ఏ పత్రాలుకావాలంటే?

Ration Cards: రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈమేరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మీ-సేవ నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో అర్హుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం అవసరమైన పత్రాలతో మీసేవలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు వీటిని పరిశీలన చేయనున్నారు. అనంతరం వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఈమేరకు గ్రామాల్లో గ్రామసభలతో పాటు నగరాల్లోనూ సభలు నిర్వహించి, అర్హులను ఎంపిక చేయనున్నారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా 89.98 లక్షల రేషన్‌ కార్డులున్నాయి.

లక్షల్లో ఎదురుచూపులు..

తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్‌ కార్డుల కోసం ఎంతోమంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. రేషన్ కార్డులు కేవలం బియ్యం కోసమే కాదు.. ఆరోగ్యశ్రీ వంటి పలు రాష్ట్ర పథకాలకూ కార్డు ఉండాలి. అలాగే, ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న హెల్త్ ఇన్సూరెన్స్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. దీనికి అర్హత కోసం రేషన్ కార్డులు కావాల్సి ఉంటుంది. రేషన్‌ కార్డ్ ద్వారా రేషన్ షాపుల నుంచి ప్రతి వ్యక్తికీ 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తారు.

హైదరాబాద్‌లో గోధుమలు కూడా ఇస్తున్నారు. గతంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వగా.. కొవిడ్‌ ప్రభావం నేపథ్యంలో మూడేళ్లుగా ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. అన్నపూర్ణ అంత్యోదయ యోజన కార్డులు ఉన్నవారికి నెలకు కిలో చక్కెర ఇస్తున్నారు. కాగా రేషన్‌ కార్డుల జారీకి అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది. గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగే అవకాశాలు లేకపోలేదని పౌరసరఫరాలశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయని, కొత్త రేషన్‌ కార్డులకు అర్హుల ఎంపిక గ్రామ, బస్తీ సభల్లోనే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News